Galli Chinnadi Song telugu lyrics
గల్లీచిన్నది గరిబోల్ల కథా పెద్దది
వారు ఉన్న ఇల్లు కిల్లి కోట్ల
కన్న చిన్నవున్నవి గల్లీచిన్నది
ఆ ఇల్ల కన్న మేలు రా
పలాక్నామ బండ్లు రా
పాత రైలు డబ్బలోలే
పడవున్న ఎందిరో గల్లీ చిన్నది . . . .|| గల్లీచిన్నది ||
తుమ్మై కడపలు తుప్పు పట్టిన సిలుకులు
పుచ్చుకొని తలుపులేమో
పెచ్చులుడి ఉంటాయో గల్లీచిన్నది . . . .|| గల్లీచిన్నది ||
ఎత్తు మనిషి చుట్టమై కొట్ట ఇంటికి వస్తే రా
పైన కడపా తగిలిరా నెత్తి
బొక్కి కట్టి పోతదో గల్లీచిన్నది . . . .|| గల్లీచిన్నది ||
దరువజలు ఇరుకు దగ్గర
జరిపి కట్టుకుంటారో ,
లావున్న కోడి పుంజు దూర
కష్టమైతదో గల్లీచిన్నది . . . .|| గల్లీచిన్నది ||
కలిగినోళ్ళ కాలనీలు వరద మురుగు నిరురా
విల్ల నల్ల పైపుతోని వియ్యం
అందుకుంతయో గల్లీచిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
వెలుగుతున్న బాల్బులా
వెలుతురంత ఉందిరా
నూటికి ఒక్క ఇంట్లో కూడా
ట్యూబ్ లైట్ లేదురో. గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
సెకండ్ హ్యాండ్ TV రా
దాని శబ్దం ఎందో చూడరా
లోటల రాళ్ళు వేసినట్టు
లోడలోడ వినిపిస్తదో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
ఇంటికొక గాధ రా విచారిస్తే బాధరా..
గాధాలన్ని తెలుసుకుంటే
గుండె గబరైతదో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
పాత పంపు ఇనుప టెంకి
రోడ్డు మీద పెట్టుకుని
గాలి కొట్టే పోరాడేమో జాలిగా
చూస్తూ ఉంటాడో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
పుర్సేకున్న పట్టపై పణలు పెట్టుకుంటడో
డొక్కు స్కూటర్ వస్తదని
దిక్కులు చూస్తుఉంటాడో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
నడుములంచే దొబ్బెటి
నాలుగు గిరాల బండిరా. . .
ఉల్లిగడ్డ అమ్మితెనే
కడుపుల కురుకస్తదో గల్లీ చిన్నది.. . . . .|| గల్లీ చిన్నది ||
మూడు జనెల పోరాదు
వేడి బాధలేమో బారెడు
వాడు చేసే దందా సరేడు
వాడికి ఎడ తీరని బాధలు గల్లీచిన్నది.. . . . .|| గల్లీ చిన్నది ||
కలే కడుపుకసరా
గాలి బుంగలమ్ముడు
పిన్నిసలు రెబ్బెనులు
కన్నీరు గుడ్సున గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
కల్లుపక ఎల్లమ్మగుడి
కలుసుకొని ఉంటాయి
తగినోల్లు ఊగుకుంట
రాగమెత్తుతుంటారో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
ఇరుకు ఇంట్లో నరకమై
విధులల్ల కస్తారో దుమ్ములోన
పొరగాన్లు పోర్లడుతుంటారో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
కోరి కోరి వారములో
కూర తెచ్చుకుంటారు
పుదీనా కొత్తిమీర దంట్లా
కలుపుకుంటారో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
ఆల్లం ఎల్లిపాయ దంచి
మసాలా దట్టించిన
మోరి గాలి వాసనకు
కూర కాంపు కొడుతదో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
దువ్వుకునే దువ్వెన
పల్లు ఇరిగిపోయి ఉంటాయో
ఎవ్వరింట్లో చూసిన అద్దం
పగిలిపోయి ఉంటాది గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
చిత్తు బొత్తు బతుకులు
చిన చిన దందాలు,
చిల్లర కొట్లల్ల వారు
చిన్న ఖాతా పెడతారో గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
ఎంల్లకెన్లు గడిసెరా ఎట్టి
బతుకులు ఇంతేరా ఎవ్వరేలిన
కాని గల్లీ రుపమేమి మరేర గల్లీ చిన్నది . . . .|| గల్లీ చిన్నది ||
Galli Chinnadi Song English lyrics
Galli chinnadi garibolla
Katha peddadhi
Varu unna intlu killi kotlo
kanna chinnavunnavi Galli chinnadhi
Aa illa kanna melura
palakunamaBandluraa
patha railu dabbalole….
Padavunna yendhiroo
Gallichinnadhi . . . || Galli chinnadhi ||
Thuammai kadapalu
thuppupattina silkulu
Pucchukuni thaluprmoo
pecchuludi untayoo
Gallichinnadhi . . . || Galli chinnadhi ||
Ettu manishi chuttamai
kotta intiki vastheraa
Paina Kadapa thagiliraa..
Netti boppi katti pothadhoo..
Gallichinnadhi . . . || Galli chinnadhi ||
Daruvajalu iruku daggaraa..
Jaripi kattukuntaroo…
Lavugunna kodipunju
Durakastamaithadho
Gallichinnadhi . . . || Galli chinnadhi ||
Kaliginolla kalanila
varadha Murugu niruraa…
Villa nalla paiputhoni
viyyam andhukuntayoo
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Veluguthunna balbula
veluthurantha undhiraa
nutiki okka intlo kuda
tube light ledhuroo.
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Second-hand TV ra
dhani shabdamendhooChudaraa.
Lotalarallu vesinattu
loda loda vinipisthdho
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Intikikokka badharaa
Vicharisthe badharaa.
gadhalanniTelusukunte
gunde baruvaithadho
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Patha pampu inupa tenki roddu
Midha pettukuni
gali kotte porademo
Jaliga chusthuntadoo
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Parsekunna pattapai panaalu
pettukuntadoo
dokku skuter vasthadani
dikkulu chusthuntado
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Nadumulanche dobbeti
nalugu girela bandi ra
ulligadda ammithene
kadupula kurukathadho
Gallichinnadhi . . . || Galli chinnadhi ||
Mudu janela poradu
vadi badhalemo baredu
vadu chese dandha saredu
vadiki eda thirani badhalu
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Kale kadupuku kasra
gali bungalammudu
Pinnisalu ribbenlu
kanniru gudsuna
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Kallupaka ellamma gudi
kalusukoni untayi
Thaginollu ugukunta
ragamettu thuntaroo
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Iruku intlo narakamai
vidhulalla kasaroo
porademo dummulona
porladuthuntadoo
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Kori kori vaaramula
kura thecchukuntaroo
Pudina Kottimeera
dantla Kalupu
kuntaroo Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Allamellipaya danchi
masala dattinchina
mori gali vasanaku
kura kanpu koduthadho
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Duvvukunte duvvena
pallu irigipoyi untadhi
Evvarintlo chusena addam
pagilipoyi untadhoo
Galli chinnadhi . . . || Galli chinnadhi ||
Chittubottu bathukulu
china china dandhalu
chillara kotlalla Varu
Chinna Katha peduthunroo
Galli chinnadhi . . . || Gallichinnadhi ||
Endlakendlu gadisina
ettibathukulu inthera
evvarelina Kani Galli
rupamemi mareraa
Gallichinnadhi . . . || Galli chinnadhi ||